30.12.25

శ్రీ కపిలేశ్వరాలయంలో వైభవంగా తెప్పోత్సవాలు ప్రారంభం teppotsavams






తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయిమొదటిరోజు శ్రీ వినాయకస్వామివారుశ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పపై విహరించి భక్తులను అనుగ్రహించారు.


తెప్పోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తెప్పోత్సవం కన్నులపండుగగా జరిగిందివిద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై ఆశీనులైన శ్రీ వినాయకస్వామివారుశ్రీ చంద్రశేఖరస్వామి వారు కపిలతీర్థం పుష్కరిణిలో 9 చుట్లు తిరిగారుపెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు అలపించారు.

 

 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నంఇతర అధికారులుఆలయ అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments