31.12.25

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో... tiruchanoor







టిటిడి స్థానిక ఆలయాలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మంగ‌ళ‌వారం ఘనంగా నిర్వహించారువిశేషంగా భక్తులు ర్శించుకున్నారు.



తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా తెల్ల‌వారుజామున 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు తిరుప్పావైధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారుఉద‌యం 3 గంట‌ల నుండి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమతించారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఆస్థానం జరిగిందిరాత్రి 8 గం. వరకు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో 32 వేలకు పైగా భక్తులు శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు


శ్రీనివాసమంగాపురంలో ...

          

శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో  ధనుర్మాస కైంకర్యాల అనంతరం  వేకువజామున 1.35 గంటల నుండి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైందిరాత్రి 8 గం. వరకు దాదాపు 40 వేలు పైచిలుకు భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు


ద్వాదశి సందర్భంగా బుధవారం కూడా ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారుఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు.


అప్పలాయగుంటలో ....


అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వేకువ జామున 3 నుండి 4 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపిధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారుఉదయం 5 నుండి రాత్రి గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.  సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు.దాదాపు 25,720 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.


జ‌న‌వ‌రి 3 వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 7 నుండి 8 గంటల వరకు  స్నపన తిరుమంజనం,  చక్రస్నానం నిర్వహించనున్నారు.


అదేవిధంగానారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 17 వేల పైచిలుకు,  కీలపట్ల శ్రీ కోనేటి రాయ స్వామి ఆలయంలో 28 వేలకు పైగాకార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో 14,500 మంది భక్తులుపుంగనూరులో శ్రీ కల్యాణ వేంకటరమణ స్వామి ఆలయాన్ని 30,990 మంది భక్తులుదేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని  46వేలకు పైగాఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని 50,402 భక్తులునందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని 34, 679 మందిజమ్మలమడుగు శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని 27,344 మంది భక్తులునాగలాపురం శ్రీ వేద నారాయణస్వామివారి ఆలయంతిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంశ్రీ కోదండరామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారుఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భక్తుల సౌకర్యార్థం టిటిడి ఆలయాల్లో అధికారులుసిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేపట్టారు


No comments :
Write comments