31.12.25

శ్రీ‌వారి ఆల‌యంలో ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించిన టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో, అద‌న‌పు ఈవో ttd chairman, eo







తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిష్టాత్మకమైన వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.


భక్తుల గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయిశ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం భ‌క్తులు వైకుంఠ ద్వా ప్ర‌వేశం చేశారుశ్రీవారి ఆలయంబ‌య‌టి క్యూలైన్ల‌లో ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ర్.నాయుడుఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారుఏర్పాట్లపై పలువురు భక్తులను అడిగి అభిప్రాయాలు తెలుసుకున్నారు పర్వదినం సందర్భంగా టీటీడీ ప్రత్యేకంగా చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.


 సంద‌ర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు మీడియాతో మాట్లాడుతూ గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా అద్భుత‌మైన ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారుక‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్ల‌తో వైకుం ద్వార ద‌ర్శ‌నాలు కొన‌సాగుతున్నాయని చెప్పారుటీటీడీ చేసిన ఏర్పాట్ల‌పై భ‌క్తులంద‌రూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలియ‌జేశారు.


టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ వేకువ‌జామున 12.05 గంట‌ల‌కు వైకుంఠ ద్వారాలు తెరిచిన అనంత‌రం అర్చ‌కులు స్వామివారికి నిత్య‌ కైంక‌ర్యాలు నిర్వహించి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు ప్రారంభించామ‌న్నారురాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేశామ‌న్నారుతొలిమూడు రోజులు -డిప్ ద్వార టోకెన్లు పొందిన భ‌క్తుల‌కు మాత్ర‌మే ద‌ర్శ‌నం ఉంటుంద‌ని తెలిపారు.


టోకెన్ లేని భ‌క్తులు జ‌న‌వ‌రి నుండి 8 తేది వ‌ర‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం క్యూలైన్ల ద్వారా వైకుం ద్వార ద‌ర్శ‌నాలు చేసుకోవ‌చ్చ‌ని చెప్పారుటీటీడీ ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ ద్వార ఇచ్చే సూచ‌న‌ల‌ను పాటిస్తూ ద‌ర్శ‌న ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకుంటే లాంటి ఇబ్బందిలేకుండా స్వామివారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌ని చెప్పారుదాదాపు 3500 మంది పోలీసు, విజిలెన్స్ సిబ్బంది ప‌గ‌డ్భందీ ప్ర‌ణాళిక‌ల‌తో భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశామ‌న్నారుఏఐ కమాండ్ కంట్రోల్ సెంట‌ర్ ద్వారా నిరంత‌రం భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తూ ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా సిబ్బంది చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని చెప్పారుతొలిమూడు రోజు పాటు టోకెన్ క‌లిగిన భ‌క్తులు నిర్దేశిత టైమ్ స్లాట్ ప్ర‌కారం ద‌ర్శ‌న క్యూలైన్ల‌కు వ‌చ్చి స్వామివారిని ద‌ర్శించుకోవాల‌ని తెలియ‌జేశారు.


వైభవంగా స్వర్ణరథోత్సవం


వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగ‌ళ‌వారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగిందిఉదయం 9 నుండి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారుపెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయంలో న్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.


శ్రీ‌వారి ఆల‌యంలో శోభాయ‌మానంగా పుష్పాలంకరణ


శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయిమహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకువైకుంఠ ద్వారంలో సంప్రదాయం ఉట్టిపడేలా పలురకాల పండ్లుసువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలుపత్రాలతో శోభాయమానంగా అలంకరణలు చేపట్టారువైకుంఠ ప్ర‌ద‌క్షిణ చేసే భ‌క్తుల‌కు  గొప్ప నుభూతి పొందేలా ముస్తాబు చేశారుప‌ది రోజుల పాటు 50 ట‌న్నుల సంప్ర‌దాయ పుష్పాలు, 10 ట‌న్నుల ఫ‌లాలునాలుగు ట‌న్నుల క‌ట్ ఫ్ల‌వ‌ర్స్ అలంక‌ర‌ణ‌ల‌కు వినియోగించ‌నున్నారు.


ఆక‌ట్టుకున్న శ్రీరంగనాథ స్వామి ఆలయ సెట్టింగు


శ్రీవారి ఆలయం వద్ద శ్రీ‌రంగ‌నా స్వామి ఆలయ సెట్టింగు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుందిటీటీడీ ఉద్యాన‌వ‌న విభాగం డిప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో దాత స‌హ‌కారంతో దీన్ని ఏర్పాటుచేశారు.


వైకుంఠ ద్వాదశినాడు చక్రస్నానం


వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధ‌వారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నానమహోత్సవం వైభవంగా జరుగనుంది సందర్భంగా శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన ఎవరైతే స్నానమాచరిస్తారో అటువంటి వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందన్నది ప్రాశస్త్యంకాగా వైకుంఠద్వాదశినాడు కూడా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.


No comments :
Write comments