16.12.25

తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కటాక్షం: శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి tiruppavai pravachanam






తిరుప్పావై ప్రవచనామృతంతో భగవంతుని కృపా కటాక్షాలకు పాత్రులు కావచ్చని శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి   చెప్పారు.


టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమ‌వారం సాయంత్రం తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం జరిగింది.


 సంద‌ర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి అనుగ్ర‌హ భాష‌ణం చేశారుశ్రీ‌వారి వైభ‌వాన్ని పాశురాల ద్వారా వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్ల‌లో గోదాదేవి ఒకరిని చెప్పారుగోదాదేవి న‌న్య‌మైన భ‌క్తిభావ‌న‌తో భ‌గ‌వంతుని కీర్తిస్తూ పాశురాలు ర‌చించార‌ని తెలిపారుభ‌గ‌వంతుని ఆరాధ‌న‌కు భాషతో ప‌నిలేద‌నిభావ‌న ముఖ్య‌మ‌ని చెప్పారు.


అనంత‌రం తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి అనుగ్ర‌హ భాష‌ణం చేస్తూవేదాల సార‌మే తిరుప్పావై అని,  ధ‌నుర్మాసంలో 30 రోజుల పాటు భ‌క్తుల హృద‌యాల్లో జ్ఞాన‌జ్యోతులు వెలిగించేందుకు తిరుప్పావై ప్ర‌వ‌చ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారుపవిత్రమైన వైకుంఠ ఏకాదశి  మాసంలోనే వస్తుందన్నారుదేశ‌వ్యాప్తంగా 233 ప్ర‌దేశాల్లో  కార్య‌క్రమం జ‌రుగుతుంద‌న్నారు.


ప్రవ‌చ‌న‌క‌ర్త శ్రీ చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్ మాట్లాడుతూసూర్యుడు ధ‌ను రాశిలో ప్ర‌వేశించ‌డాన్నే ధ‌నుర్మాసం అంటార‌న్నారు మాసంలో బ్ర‌హ్మ ముహూర్తంలో భ‌గ‌వంతుని ఆరాధిస్తే మంచి ఫ‌లితం వ‌స్తుంద‌ని చెప్పారుగోదాదేవి అమ్మ‌వారు పూమాల‌ల‌తోపాటు పాశురాల మాల‌ను శ్రీ రంగ‌నాథ‌స్వామికి స‌మ‌ర్పించార‌ని వివ‌రించారు.


కాగాధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి 2026 జనవరి 14 తేదీ వరకు అన్నమాచార్ కళామందిరంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీ చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్ చే తిరుప్పావై పై ప్రవచనం ఉంటుందిశ్రీ‌మ‌తి ద్వారం లక్ష్మి పాశురాల‌ను గానం చేస్తారు.


 కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డామేడసాని మోహన్టిటిడి ఎస్టేట్ అధికారి శ్రీమతి సువర్ణమ్మ , ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ పురుషోత్తంపుర ప్రజలు పాల్గొన్నారు.


No comments :
Write comments