పవిత్ర ధనుర్మాసం ముగిసిన మరుసటి రోజైన జనవరి 15వ తేదీ గురువారం సాయంత్రం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో గోదా కల్యాణం జరగనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు వేడుకగా కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గోదా కల్యాణం నృత్యరూపకం ప్రదర్శిస్తారు. చివరగా గోవిందనామ సంకీర్తనతో కార్యక్రమం ముగుస్తుంది.
No comments :
Write comments