15.1.26

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా శ్రీ గోదాకల్యాణం goda kalyanam







పవిత్రమైన ధనుర్మాసం ముగింపు సందర్భంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బుధవారం శ్రీ గోదా కల్యాణం వైభవంగా జరిగిందిధనుర్మాసంలో టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల 233 కేంద్రాల్లో నెల రోజు పాటు ప్రముఖ పండితులతో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించారు.


ముందుగా శ్రీ గోదాదేవి(ఆండాళ్‌)శ్రీరంగనాథస్వామివారి ఉత్సవర్లను వేదికపై కొలువుతీర్చారుఅనంతరం  శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారువేద పారాయణదారుల వేద పఠనంఅన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గాత్రసంగీతం డుమ స్వామిఅమ్మవార్ల కల్యాణం వైభవంగా జరిగింది.


అన్నమాచార్య కళామందిరంలో ముగిసి తిరుప్పావై ప్రవచనాలు


టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో డిసెంబరు 16 నుంచి దాదాపు నెల రోజుల పాటు జరిగిన తిరుప్పావై ప్రవచనాలు బుధవారం ముగిశాయితిరుపతికి చెందిన ప్రముఖ పండితులు శ్రీ చక్రవర్తి రంగనాథన్‌ ఇక్కడ తిరుప్పావై  ప్రవచనాలు వినిపించారు.


 కార్యక్రమంలో టిటిడి ఎఫ్ఏసిఏఓ శ్రీ .బాలాజీఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేట‌ర్ శ్రీ పురుషోత్తంప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీ‌మ‌తి కోకిలస్థానిక భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments