19.1.26

జ‌న‌వ‌రి 21న శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 35వ వ‌ర్ధంతి - జ‌న‌వ‌రి 23న శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ 133వ జ‌యంతి gouri peddi rama subba sharma




తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అమూల్యమై సేవలందించిన శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ  35 వర్ధంతి జ‌న‌వ‌రి 21న‌శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 133 జ‌యంతి జ‌న‌వ‌రి 23 టీటీడీ ఘ‌నంగా నిర్వ‌హించ‌నుంది.


జ‌న‌వ‌రి 21 ఉదయం 9 ఎస్వీ ఓరియంటర్ కాలేజీ పరిసరాలలో ఉన్న శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారుఅనంత‌రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉద‌యం 10 గంట‌ల‌కు  శ్రీ గౌరి పెద్ది రామసుబ్బశర్మ 35 వర్ధంతి సభ ఘనంగా జ‌రుగ‌నుంది.


జ‌న‌వ‌రి 23 ఉదయం 9 శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ మ‌రియు పిజి క‌ళాశాల ప్రాంగ‌ణంలోని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారుఅనంత‌రం తిరుపతిలోని అన్నమాచార్ కళామందిరంలో ఉద‌యం 10 గంట‌ల‌కు  శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 133 జ‌యంతి సభ ఘనంగా జ‌రుగ‌నుంది.


శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ


శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామంలో 1893, జనవరి 23 జన్మించారుమైసూరు మహారాజ కళాశాలలో 3సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా సేవలందించారురేడియోకు ‘‘ఆకాశవాణి’’ అని పేరు పెట్టింది వీరేవీరి ప్రతిభను గుర్తించి అప్పటి టీటీడీ ఈవో శ్రీ చెలికాని అన్నారావు 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను అప్పగించారుఅప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన సంకీర్తనలను పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారుసంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారుశ్రీఅనంతకృష్ణశర్మను 1979, మార్చి 11 టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా నియమించారు.

No comments :
Write comments