1.1.26

తిరుమలలో జరిగిన బ‌ర్డ్ ట్రస్ట్, హెచ్ డీపీపీ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశాలు birrd hospital






టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్.నాయుడు అధ్య‌క్ష‌త‌న‌ బ‌ర్డ్ ఆసుప‌త్రి మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్య‌క‌లాపాల‌పై బుధ‌వారం సాయంత్రం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో ట్రస్టు మరియు ఎక్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించారు స‌మావేశాలలో ప‌లు అంశాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకున్నారు


టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్సింఘాల్‌టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి జాన‌కి దేవిశ్రీ నరేష్ కుమార్బర్డ్ డైరెక్టర్ డా జగదీశ్హెచ్‌డీపీపీ సెక్ర‌ట‌రీ శ్రీ శ్రీ‌రామ్ ర‌ఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.


బర్డ్ స‌మావేశంలోని కొన్ని ముఖ్యాంశాలు


•  బ‌ర్డ్ ఆసుప‌త్రిలో ఆర్థోఇన్ పేషంట్ సేవ‌ల‌ను బ‌లోపేతం చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు మ‌రింత మంది డాక్ట‌ర్లుపారా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కం


•  భ‌ద్ర‌త‌పారిశుద్ధ్య సేవ‌ల‌ను మ‌రింత మెరుగు ప‌రిచేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యం.


•  డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు కలిగి ఉండిమోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న రోగులలో ఏటా 100-150 మంది రోగులకు అయ్యే పూర్తి ఖర్చును భరించడానికి ముందుకు వచ్చిన చెన్నైకి చెందిన గువీ హెల్త్ కేర్ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలను వినియోగించుకోవడం.


అంత‌కుముందు హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌క‌లాపాల‌పై ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది స‌మావేశంలో హిందూ ధ‌ర్మ ప్ర‌చారాన్ని మ‌రింత విస్తృతం చేసేందుకు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు

No comments :
Write comments