టిటిడి ఎస్వీ గోశాలకు టిటిడి పాలక మండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ 8 లారీల ఎండుగడ్డిని విరాళంగా అందించారు. ఈ మేరకు 8 లారీల గడ్డిని ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎన్. శివకుమార్ కు బుధవారం అందించారు.
టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ తన కుటుంబసభ్యులతో కలిసి పశుగ్రాసాన్ని ఎస్వీ గోశాల డైరెక్టర్ కు అందజేశారు. మూగ జీవులకు ఆహారం అందించాలనే సంకల్పంతో కాకినాడ నుండి పశుగ్రాసాన్ని శ్రీనివాస సేవా ట్రస్ట్ , శ్రీ జ్యోతుల నెహ్రూ ట్రస్ట్ నుండి తీసుకువచ్చి ఉచితంగా అందజేసినట్లు ఆయన చెప్పారు. టిటిడికి చెందిన మూడు గోశాలలకు ఎండుగడ్డిని త్వరలో అందజేస్తామన్నారు. బుధవారం ఇచ్చిన 8 లారీల ఎండుగడ్డిని పలమనేరులోని టిటిడి గోశాలకు పంపించాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం పశువుల ఆలనా పాలనా ఏ ఏ సమయానికి పశుగ్రాసాన్ని, మందులు, దూడల పెంపకం, మౌళిక సదుపాయాలను టిటిడి ఎస్వీ గోశాల డైరెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్వీ గోశాల అధికారులు పాల్గొన్నారు.
No comments :
Write comments