4.1.26

టిటిడి ఆధ్వర్యంలో కొండగట్టులో అభివృద్ధి పనులు - టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు kondagattu temple






తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు తెలిపారుకొండగట్టులో ఆలయ అభివృద్ధి పనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు.


 సందర్భంగా టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడుతూకొండగట్టులో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ టిటిడిని కోరడంతో అంశాన్ని ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారుతదుపరి టిటిడి బోర్డు సమావేశంలో ఆల అభివృద్ధి పనులకు రూ. 35.19 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారుభక్తుల సౌకర్యార్థం టిటిడి నిధులతో 96 గదులతో కూడిన ర్మశాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.


ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూకొండగట్టు ఆలయ భివృద్ధి  పనులకు రూ. 35.19 కోట్లు కేటాయించిన టిటిడి పాలక మండలి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడుపాలక మండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారుకొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడును కోరామనిసీఎం చంద్రబాబు సూచనలతో టిటిడి బోర్డు నిర్ణయం తీసుకోవడంపై అభినందనలు తెలియజేశారు.


అంతకుముందు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్, టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు చేరుకోగానే తెలంగాణ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానంతరం తీర్థప్రసాదాలను అందించారు.

No comments :
Write comments