8.1.26

శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశాధ్యక్షుడు mauritius prez







మారిషస్ దేశాధ్యక్షుడు శ్రీ ధరమ్ బీర్ గోకుల్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.


క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి ఆలయం వద్దకు విచ్చేసిన ఆయనకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డిటీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.


ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు


దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలుచిత్రపటంక్యాలెండర్పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు.


 కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిజిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ , జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments