23.1.26

నాదనీరాజనం వేదికపై అలరించిన సంగీత సంగమం కార్యక్రమం naada neerajanam






శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం నిర్వహించిన పద్మశ్రీ శివమణి బృందం సంగీత సంగమం కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది.

 

 కార్యక్రమంలో శ్రీ ఆర్.రఘురామ్ గాత్రం అందివ్వగా మాండొలిన్ శ్రీ యు.రాజేష్మృదంగం శ్రీ విద్యాసాగర్కీబోర్డ్ శ్రీ విశాఖ్ రామ్ ప్రసాద్ లు అందించారు.

 

అన్నమయ్యత్యాగరాజపురందరదాసులు సంకీర్తనలకు పద్మశ్రీ శివమణి తన డ్రమ్స్ ప్రదర్శనతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.

 

 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ పద్మశ్రీ శివమణి గారు నాదనీరాజనం వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారనిఅందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని తెలిపారునాదనీరాజనం వేదికపై ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను వేలాదిమంది భక్తులు ప్రత్యేకంగాలక్షలాదిమంది భక్తులు పరోక్షంగా వీక్షస్తున్నారని తెలిపారుమన సంస్కృతిసాంప్రదాయాలను ప్రపంచానికి చేరవేసేందుకు ఎస్వీబీసీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారుఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలియజేశారు.

 

అనంతరం పద్మశ్రీ శివమణి బృందాన్ని ఎస్వీబీసీ సీఈఓ శ్రీ ఫణి కుమార్ శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలుచిత్ర పటాన్ని అందజేశారు.

 

 కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథంశ్రీ సోమన్నారాయణఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments