13.1.26

అలరించిన శ్రీ వేంకటేశ నవరత్నమాల సంకీర్తనా కార్యక్రమం navaratnamala





శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం తిరుమలలోని పాపవినాశనం రోడ్డులో గల కళ్యాణమస్తు వేదికపై నిర్వహించిన శ్రీ వేంకటేశ నవరత్న సంకీర్తనా కార్యక్రమం భక్తులను అలరించింది.


టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల వారు శ్రీ వేంకటేశ్వరస్వామిని స్తుతిస్తూ చేసిన సంకీర్తనలలో నవరత్నాలలాంటి  సంకీర్తనలను 300 మంది సుప్రసిద్ధ కళాకారులు గోష్ఠిగానం చేశారు.


కాగా జనవరి 17 నుండి 19 తేది వరకు తిరుమలలో పురందరదాసుల ఆరాధన మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.


No comments :
Write comments