24.1.26

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ - శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇచ్చేందుకు అంగీకారంPROGRESSIVE HUMANITARIAN GESTURE




టిటిడి మహిళా సంక్షేమ విభాగానికి చెందిన అధ్యక్షురాలు, ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ శ్రీమతి కట్టమంచి ఇందిర మరణానంతరం తన పార్థివ దేహం  స్విమ్స్ - శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ను శుక్రవారం కలిసి అఫిడవిట్ ను అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీమతి కె. ఇందిర మాట్లాడుతూ, గత నవంబర్ 15వ తేదీన తన భర్త డా. కె. శివాజీ పలు కార్పోరేట్ కాలేజీలలో ఫ్యాకల్టీగా పనిచేశారని, తాను చనిపోయినా విద్యార్థులకు ఉపయోగపడాలనే సదుద్దేశ్యంతో మరణానంతరం తన భర్త పార్థివ దేహం మెడికల్ కాలేజీకి డొనేషన్ చేశామన్నారు. తన భర్త కోరిక మేరకు తాను చనిపోయాక తన పార్థివ దేహం మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో శుక్రవారం అందుకు సంబంధించిన అఫిడవిట్ ను టిటిడి ఈవోకు అందజేశారు. శ్రీమతి కె. ఇందిర నిర్ణయాన్ని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు.

మరణానంతరం పార్థీవ దేహం మట్టిలో కలిసిపోవడం కన్నా మెడికల్ విద్యార్థులకు ఉపయోగపడేలా శ్రీమతి కె. ఇందిర నిర్ణయం తీసుకోవడం హర్షనీయం అని తెలిపారు. అందుకు సంబంధించిన అఫిడవిట్ ను శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల అనాటమి డిపార్ట్ మెంట్ అధికారులకు టిటిడీ ఈవో పంపించారు.

మహిళా  సంక్షేమ సంఘం .

నవంబరు 15 వ తేదీ ,గతంలో తిరుపతిలోని లీలా మహల్ వద్ద భార్యాభర్తలిద్దరూ కార్పొరేట్ స్కూలు స్థాపించడం జరిగింది. 

ఎంతోమంది విద్యార్థులకు తక్కువ ఫీజులతో చదువు చెప్పించడంతోపాటు కొంతమందికి ఉపాధి చూపించవచ్చు అనే ఉద్దేశ్యంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్కూలును స్థాపించారు. 

No comments :
Write comments