24.1.26

భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి radha saptami







జనవరి 25 తేదిన తిరుమలలో నిర్వహించబోయే రథ సప్తమి వేడుకలకు భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా ర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారుశుక్రవారం సాయంత్రం ఆయన టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మంతిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుసీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో రథ సప్తమికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.


 సందర్భంగా మాడ వీధుల్లోని గ్యాలరీలుఅన్న ప్రసాదాల పంపిణీకి తీసుకుంటున్న చర్యలు పరిశీలించిభక్తులకు ఎలాంటి అసౌకర్యం లగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


అనంతరం మీడియాతో మాట్లాడుతూ రథ సప్తమి సందర్భంగా ఇప్పటికే తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారుభక్తుల భద్రతవివిధ విభాగాల సమన్వయంప్రవేశనిష్క్రమణ మార్గాల వద్ద ధికారుల తీసుకోవాల్సి చర్యలు వంటి అంశాలపై చర్చించి అధికారులకు సూచనలు చేయడం జరిగిందన్నారుగ్యాలరీల్లో కూర్చునే భక్తులకు ఎండకువర్షానికి ఇబ్బంది పడకుండా పందిళ్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.


 పరిశీలనలో టీటీడీ సీఈ శ్రీ సత్య నారాయణడిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథంశ్రీ రాజేంద్రఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments