VIDEO
కర్ణాటక
సంగీత , పద కవితా పితామహులు శ్రీ పురం దరదాసులు సాక్షాత్తు నారద స్వరూ పులని శ్రీ పాద రాజ మఠాధిపతి శ్ రీ సుజయనిధి తీర్థ స్వామీజీ ఉద్ ఘాటించారు .
శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్ సవాలు టీటీడీ దాస సాహిత్య ప్రా జెక్టు ఆధ్వర్యంలో శనివారం ఘనం గా ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగా తిరుమలలోని ఆస్థా న మండపంలో సుప్రభాతం, ధ్యానం, సా మూహిక భజన, నగరసంకీర్తన కార్యక్ రమాలు, పురందర సాహిత్య గోష్ఠి , వివిధ పీఠాధిపతుల మంగళాశాసనా లు, సంకీర్తనమాల కార్యక్రమాలు ని ర్వహించారు. శ్రీ పాద రాజ మఠాధి పతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామీ జీ, శ్రీ వీద్యా విజయ తీర్థ స్ వామీజీ మంగళ శాసనములు అందిం చారు.
ఈ సందర్భంగా శ్రీ పాద రాజ మఠాధి పతి శ్రీ సుజయనిధి తీర్థ స్వామీ జీ భక్తులకు అనుగ్రహ భాషణం చేస్ తూ మానవ జీవితం సమస్యల వల యమని, వీటి నుండి బయటపడా లంటే నవవిధ భక్తిమార్గాల్లో నామసంకీర్తనకు విశేష ప్రాధా న్యం ఉందని తెలిపారు. భగవంతుని చేరాలంటే ముందు ఆయన పరమభక్తుల అనుగ్రహం అవసరమని పురాణాలు పేర్ కొంటున్నాయని, ఈ కోవకు చెందిన ప రమభక్తుడు శ్రీ పురందరదాసు అన్ నారు. నేడు వేలాది మంది భక్తులు పురందరదాసు రచించిన లక్షలాది కీ ర్తనలు ఆలపిస్తూ స్వామివారి కృ పకు పాత్రులు అవుతున్నారని, ఇదే కలియుగంలో నామసంకీర్తనకున్న వై శిష్ట్యమన్నారు.
అనంతరం టీటీడీ దాస సాహిత్య ప్రా జెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆ నందతీర్థాచార్యులు స్వామీజీలకు శ్రీవారి ప్రసాదాలు అందజేసి శా లువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్ తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నా రు.
కాగా, రెండవ రోజైన జనవరి 18 న ఉదయం 6 గంటలకు అలిపిరి చెంత పు రందరదాసుల విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తారు. సాయంత్రం 6 గం టలకు శ్రీవారి ఆలయం నుండి నారా యణగిరి ఉద్యానవనం వరకు శ్రీవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఊంజల్ సేవ, దాససంకీర్తన కార్యక్రమాలు ఉంటాయి.
చివరిరోజు జనవరి 19 న ఉదయం సు ప్రభాతం, ధ్యానం, సామూహిక భజ న, నగర సంకీర్తన, ఉపన్యాసము లు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
No comments :
Write comments