3.2.26

ఫిబ్రవరి 4న శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం koil alwar tiurmanjanm




తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో బ్రవరి 4 తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారుబ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 17 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే.

 సందర్భంగా బుధ‌వారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకంఅలంకారము, శుద్ధి నిర్వహిస్తారుఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది కారణంగా ఉదయం 8 నుంచి 11 గంటల వరకుతిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయ ప్రాశ‌స్త్యం :

శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలోని శివుని విగ్రహాన్ని కపిలమహాముని ప్రతిష్ఠించినందుకు  తీర్థానికి కపిలతీర్థం అని పేరు వచ్చింది ఆలయం తిరుమల కొండకు దిగువ భాగాన ఒక గుహను ద్వారంగా చేసుకుని గుహాలయంగా విరాజిల్లుతూ ఉందికొండనుంచి జాలువారేనీళ్లు నేరుగా  కపిలతీర్థ పుష్కరిణిలో పడుతుందికాబట్టి ‘కపిలతీర్థం’ అని పిలువబడుతుందిదీనినే ఆళ్వార్ తీర్థం’ అని కూడా పిలుస్తారు ఆలయం ముందు ఒక పెద్ద రాతి నంది విగ్రహం శివుడికి ఎదురుగా భక్తులకు దర్శనమిస్తుంది.

ఇక్కడి స్థలపురాణం ప్రకారంకపిలముని ఇక్కడ తప్పసు చేసినప్పుడు శివ-పార్వతులు అతని తప్పసుకు మెచ్చి ఇక్కడ ప్రత్యక్షమయ్యారటక్కడ ఉన్న శివలింగం ‘స్వయంభు’ ని చెప్పబడుతున్నది.

కపిలేశ్వరస్వామి ఆలయం దెగ్గరలో నమ్మాళ్వార్ గుడి కూడా ఉందికను  తీర్థాన్ని ‘ఆళ్వార్ తీర్థం’ అని అంటారు ఆలయంలో కపిలేశ్వరస్వామి ఆలయంతోపాటు కామక్షమ్మవారి ఆలయంవినాయకస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయందక్షిణమూర్తిస్వామి ఆలయంనటరాజస్వామివారి ఆలయంకోటిలింగేశ్వరస్వామి ఆలయంఅగస్తీశ్వరస్వామి ఆలయంనవగ్రహాలయాలలో శైవాగమం ప్రకారం పూజలు నిర్వహిస్తుండగా ఆలయప్రాంగణంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయం పాంచరాత్ర ఆగమానుసారం శ్రీవేణుగోపాలస్వామి ఆలయంఅభయహస్ ఆంజనేయస్వామి ఆలయాలలో వైఖానస ఆగమం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నారు.





No comments :
Write comments