13.2.26

అధికార నంది వాహ‌నంపై సోమస్కందమూర్తి adhikara nandi







తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి అధికా నంది వాహ‌నంపై అభ‌య‌మిచ్చారు.


భజనమండళ్ల కోలాటాలుభజనలుమంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగిందివాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌అన్నారావు సర్కిల్‌వినాయక నగర్‌ క్వార్టర్స్‌రేరామ హరేకృష్ణ గుడిఎన్‌జిఓ కాలనీఅలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుందిభక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.


శ్రీ కపిలేశ్వరస్వామి వాహనసేవలలో విశిష్ఠమైనది అధికారనంది అధికారనందికి మరోపేరు కైలాసనందికైలాసంలో మెడలో మువ్వలదండలతోకాళ్లకు గజ్జెలతో మనోహరాకారంతోబంగారుకొమ్ములతో అలరారే నంది భవుడికి నిత్యవాహనం.


 కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆల‌య అర్చ‌కులువిశేస సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments