6.2.26

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం alwar tirumanjanam






శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 8 నుండి 16 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘ‌నంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవకొలువుపంచాంగశ్రవణం నిర్వహించారుఉదయం 6.30 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగిందిఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర న్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని లయం అంతటా ప్రోక్షణం చేశారుఉదయం 11 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.


పరదాలు విరాళం :


తిరుపతికి చెందిన శ్రీ మ‌ణి రెండు పరదాలురెండు‌ కురాళాలు ఆలయానికి విరాళంగా అందించారురానున్న బ్రహ్మోత్సవాల్లో వీటిని వినియోగించనున్నారు.


 కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మీవిజివో శ్రీ గిరిధ‌ర్ఏఈవో శ్రీ గోపినాథ్సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్ బాబుటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ ధ‌నశేఖ‌ర్‌శ్రీ మునికుమార్‌ఆల‌ అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులుఇతర అధికారులు పాల్గొన్నారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ


08-02-2026


ఉదయం – ధ్వజారోహణం ( కుంభ ల‌గ్నం. 8.15 నుండి 8.35 గంటల వరకు)


రాత్రి – పెద్దశేష వాహనం


09-02-2026


ఉదయం – చిన్నశేష వాహనం


రాత్రి – హంస వాహనం


10-02-2026


ఉదయం – సింహ వాహనం


రాత్రి – ముత్యపుపందిరి వాహనం


11-02-2026


ఉదయం – కల్పవృక్ష వాహనం


రాత్రి – సర్వభూపాల వాహనం


12-02-2026


ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)


రాత్రి – గరుడ వాహనం


13-02-2026


ఉదయం – హనుమంత వాహనం


మధ్యాహ్నంవసంతోత్సవం (. 2 నుండి 3 గంటల వరకు)


సాయంత్రం – స్వర్ణరథం(సా. 4 నుండి 5 గంటల వరకు)


రాత్రి – గజ వాహనం


14-02-2026


ఉదయం – సూర్యప్రభ వాహనం


రాత్రి – చంద్రప్రభ వాహనం


15-02-2026


ఉదయం – రథోత్సవం


రాత్రి – అశ్వవాహనం


16-02-2026


ఉదయం – చక్రస్నానం(. 9.55 నుండి 10.15 గంటల వరకు)


రాత్రి – ధ్వజావరోహణంసా. 6 నుండి రాత్రి 7 గంటల వరకు)


ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కురాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.


ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలుభజన కార్యక్రమాలను నిర్వహించనున్నారుఅన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

No comments :
Write comments