14.2.26

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు annaprasadam






శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాదిమంది భక్తులు విచ్చేస్తుండగావారి సౌకర్యార్థం టీటీడీ దాతల సహకారంతో ప్రతిరోజూ రుచికరమైన అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందిస్తోంది. భక్తులు  సేవపై ఆనందం వ్యక్తం చేస్తూ టీటీడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ అనాదిగా ఉచి అన్నప్రసాద వితరణను యజ్ఞంగా నిర్వహిస్తోందిఇదే విధంగా టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా దాతల హకారంతో అన్నప్రసాదాల వితరణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.


టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్నాయుడుఈవో శ్రీ ఎంరవిచంద్ర ఆదేశాల మేరకుజేఈవో శ్రీ వీరబ్రహ్మంఆలయ ప్రత్యేకాధికారి డా.టి. రవి పర్యవేక్షణలోప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్ ఆధ్వర్యంలో  అన్నప్రసాద సేవ సమర్థవంతంగా కొనసాగుతోంది.


ప్రతిరోజూ ఉదయం సుమారు 700 మంది భక్తులకు పొంగలిసేమియా ఉప్మాటమాటా రైస్కిచిడివెజ్ రైస్చట్నీకేసరి వంటి పదార్థాలు అందిస్తున్నారుమధ్యాహ్నం న్నంఆకుకూర పప్పుచట్నీసాంబారురసంపెరుగుఅప్పడాలుస్వీటుఅరటిపండు తదితర తొమ్మిది రకా వంటకాలతో మహా ప్రసాదం వడ్డిస్తున్నారురాత్రి సుమారు 700 మందికి దొండకాయ రైస్కిచిడిటమాటా రైస్వెజ్ రైస్ అందిస్తున్నారు.


అదనంగాటీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం పొంగలిఉప్మావడచట్నీసాంబారుమధ్యాహ్నంరాత్రి సాంబారు అన్నంపెరుగు అన్నం నిరంతరాయంగా పంపిణీ చేస్తున్నారు.


శుభ్రతరుచితనంసమయపాలనతో నిర్వహిస్తున్న  అన్నప్రసాద సేవ భక్తుల ప్రశంసలు అందుకుంటోంది.

No comments :
Write comments