11.2.26

సింహ‌ వాహన‌సేవ‌లో ఆక‌ట్టుకున్న చండ మేళం chanda melam






శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం ఉదయం సింహ‌ వాహ‌న‌సేవ‌లో చండ మేళంకోలాటాల క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను క‌ట్టుకున్నాయిటిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో  ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశారు.


చండ‌మేళం


క‌ర్ణాట‌క‌ రాష్ట్రం ఉడిపికి చెందిన స్వామి కొర‌గ‌జ క‌ళా స‌మితి శ్రీ శ్రీ‌క‌ర్‌ బృందం చండ‌మేళం (కేర‌ళ డ్ర‌మ్స్‌వాయిస్తున్నారుకేర‌ళ డ్ర‌మ్స్‌ బృందంలో మొత్తం 10 మంది క‌ళాకారులు న్నారువీరు డ్ర‌మ్స్‌తాళాలు ల‌య‌బ‌ద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తారువీరు గ‌త 8 సంవ‌త్స‌రాలుగా టీటీడీ అనుబంధ ఆల‌యాల‌లో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వాల‌లో పాల్గొంటున్నారు.  


కోలాటాల ప్రదర్శనలు


అదేవిధంగాతెలంగాణ రాష్ట్రం సూర్య‌పేట‌కు చెందిన హ‌రే శ్రీ‌నివాస‌ కోలాట‌ భజన బృందంలోని 16 మందిప‌శ్చిమ గోదావ‌రి జిల్లా క్రిష్ణ‌య్య‌పాళ్యంకు చెందిన శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తిశ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర శ్రీ స‌త్య‌క్రిష్ణ భ‌జ‌న మండ‌లికి చెందిన‌ 100 మంది,  తాడేప‌ల్లి గూడెంకు చెందిన 15 మందితిరుప‌తికి  చెందిన క‌ళా బృందాలు కోలాటం నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


No comments :
Write comments