19.2.26

చిన్నశేష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం chinna sesha vahanam





హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో  భాగంగా రెండో రోజైన బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారుభక్తుల కోలాటాలుమంగ‌ళ వాయిద్యాలుఇతర కళాప్రదర్శనల నడు వాహనసేవ అత్యంత రమణీయంగా సాగింది.


చిన్న‌శేష వాహనం – కుటుంబ శ్రేయస్సు


చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారుశ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషిప్రపంచం శేషభూతంశేషవాహనం  శేషిభావాన్ని సూచిస్తుందిచిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.


రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను టాక్షించనున్నారు.


వాహ‌న‌సేవ‌లో అర్చకులుఏఈవో శ్రీ రమేష్టెంపుల్ ఇన్పెక్టర్స్ శ్రీ నిరంజన్శ్రీ హరికృష్ణపలువురు అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments