శ్రీ
కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఇందులో బాగంగా సాయంత్రం 5:30 నుంచి 6:30 గంటల వరకు గాత్రకచేరి నిర్వహించారు. ఇందులో ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ సుధాకర్ బృందం "మహాగణపతిం..., కమలాంబ...., సాంబ సదా శివ....., " అను కృతులు సుమధురంగా ఆలపించారు.
తదుపరి వాయులీన్ కచేరీలో డా. కృష్ణ బృందం "వాతాపి గణపతిం...., ఎందరో మహానుభావులు...., నాదతనుమనిషం..., శివ శివ శివయనరాధ....., జయ జయ కరుణాంతరంగ...., " వంటి కృతులు పాడి ప్రేక్షకులను అలరించారు. తరువాత శ్రీ రవి సుబ్రమణ్యం బృందం "మహాగణపతిం...., ఐగిరి నందిని.....,ముద్దుగారే యశోద....,శివపంచాక్షరి..." వంటి అంశాలతో భక్తులను ఆకట్టుకున్నాయి.
No comments :
Write comments