27.2.26

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయంలో పుష్ప సుగంధాల పరిమళం వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగ మహోత్సవం flower decoration





హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం దివ్యమైన పుష్పసుగంధాలతోభక్తి పారవశ్య వాతావరణంలో పుష్పయాగ సేవ అత్యంత వైభవంగా నిర్వహించబడింది.


 ఆలయంలో ఫిబ్రవరి 17 నుండి 25 తేదీ వరకు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసి విషయం విదితమేనిత్యకైంకర్యాలుబ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులుపరిచారకులుఅధికారులుక్తులవల్ల తెలియకుండానే ఏవైనా లోపాలు సంభవించి ఉంటేవాటి నివృత్తి కోసం  పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.


 సందర్భంగా ఉదయం 5.00 గంటల నుండి 6.30 గంటల వరకు యాగశాలలో వేదపండితులచే వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారుఅనంతరం ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు శ్రీదేవిభూదేవి సమేత శ్రీ కల్యా వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారుపాలుపెరుగుతేనెకొబ్బరినీళ్లుపసుపుచందనం వంటి దివ్య ద్రవ్యాలతో అభిషేకం చేసి స్వామివారిని శోభాయమానంగా అలంకరించారు.


మధ్యాహ్నం 3.00 నుండి 5.00 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా సాగింది. 12 రకాల పుష్పాలు, 6 రకాల పవిత్ర ఆకులతో స్వామివారికి పుష్పసమర్పణలు నిర్వహించారుచామంతిరోజాగన్నేరుసంపంగిమల్లెకనకాంబరంతామరలువమాను సంపంగి తదితర పుష్పాలతో పాటు తులసిదవనంమరువంబిల్వంపన్నీరాకు వంటి ఆకులను వినియోగించారు మహోత్సవం కోసం సుమారు 2 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా సమర్పించారుబెంగళూరు నుండి ప్రత్యేకంగా పుష్పాలు అందాయి.


 కార్యక్రమంలో టీటీడీ ఎల్..సీ చైర్మన్ శ్రీ .వి.రెడ్డిఏఈవో శ్రీ రమేశ్ఆలయ అర్చకులుటెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నిరంజన్ కుమార్శ్రీ హరి తదితర అధికారులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments