తమిళనాడు
రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుదవారం రాత్రి 7 గంటలకు అమ్మవారు గజవాహనంపై భక్తులను కటాక్షించారు.
శ్రీ పద్మావతి అమ్మవారి వాహనసేవల్లో గజవాహన సేవకు ప్రత్యేకత ఉంది . గజం ఐశ్వర్యసూచకం. అందుకే "ఆగజాంతగం ఐశ్వర్యం" అని ఆర్యోక్తి. పాలసముద్రంలో ప్రభవించిన సిరులతల్లిని గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ధనంజయులు, సూపరింటెండెంట్ శ్రీమతి పుష్పలత, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments