14.2.26

గ‌జ వాహనంపై శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి అభ‌యం gaja vahanam








శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల‌కు రాజ‌మ‌న్నార్ దండం ధ‌రించి చ‌క్ర‌వ‌ర్తి అలంకారంలో శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి గజవాహనంపై భ‌క్తుల‌కు అభ‌య‌మిచ్చారు.


వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగాభక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా రిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


గజ వాహనం – క‌ర్మ విముక్తి


రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు వాహ‌న‌సే ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోందిస్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాకఉత్స‌వాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.


వాహ‌న సేవ‌లో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిఏఈవో శ్రీ గోపినాథ్‌కంక‌ణ‌బ‌ట్టార్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులుసూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌శ్రీ ధ‌ శేఖ‌ర్‌ఇత‌ర అధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments