14.2.26

"శ్రీ విఘ్నరాజం భజే.., అర్ధనారీశ్వర నృత్యం...శంభో మహాదేవ...." నృత్యంతో భ‌క్తుల‌లో మ‌రింత ఆధ్యాత్మిక భ‌క్తి భావం cultural program







శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజైన శుక్ర‌వారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేది ఏర్పాటు చేసిన భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు భ‌క్తులలో మ‌రింత ఆధ్యాత్మిక భ‌క్తి భావాన్ని పెంచింది.

 


ఇందులో భాగంగా సాయంత్రం 5:30 గంట‌ల‌కు ఎస్వీ సంగీత నృత్య కళాశా నాదస్వర విభాగ అధ్యాపకులు శ్రీ రవిప్రభ బృందం "వర వల్లభ....సభాపతి...., సదానంద తాండవం...., పరంధామవతి మహాదేవ శివ శంభో....," అను  కృతులు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారుతదుపరి సాయంత్రం 6:30 గంట‌ల నుండి ఎస్వీ సంగీత కళాశాల వీణ విభాగ ధ్యాపకులు శ్రీమతి జ్ఞానప్రసూన బృందం " శ్రీవిఘ్నరాజం....., సాం శివాయనేవే ...... , లింగాష్టకం....., భో శంభో....."  వంటి కృతులతో వాయించి భ‌క్తుల‌ను అలరించారు.


త‌రువాత రాత్రి 7:30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ సంగీత‌ కళాశాల ప్రిన్సిపాల్ డా|| శ్రీమతి ఉమా ముద్దుబాల బృందం " శ్రీ విఘ్నరాజం భజే..... , నటేశ కౌత్వం...., మల్లారి..... , అర్ధనారీశ్వర నృత్యం ......, శంకర శ్రీగిరి..... , భో శంభో.... , శంభో మహాదేవ.... , దేవీ స్తుతి....."  వంటి అంశాలు అందరిని ఆకట్టుకున్నాయి.

No comments :
Write comments