శ్రీ
కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి జరుగనున్న గరుడసేవ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధులను జేఈవో శ్రీ వి.వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ మురళికృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడుతో కలిసి బుధవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు.
గరుడసేవకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ టీటీడీ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా అదనపు భద్రతా సిబ్బంది, పార్కింగ్ , ట్రాఫిక్ తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ అందివ్వాలని, మెరుగైన పారిశుద్ధ్యం కొరకు అదనపు సిబ్బంది, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
No comments :
Write comments