శ్రీనివాసమం
గాపురం
శ్రీకల్యాణ
వేంకటేశ్వరస్
వామి
వార్షిక
బ్రహ్మోత్సవాల్లో
భాగంగా
ఐదో
రోజైన
గురువారం
రాత్
రి
విశేషమైన
గరుడ
వాహనసేవ
రాత్
రి
7 గంటల
నుండి
అత్యంత
వైభవంగా
జరిగింది
.
స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారులవాయిద్యాలు , మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకటయ్య చౌదరి, స్థానిక శాసన సభ్యులు శ్రీ పులివర్తి నాని, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మీ, జేఈవోలు శ్రీ వి.వీరబ్రహ్మం, డా. ఎ.శరత్, సివిఎస్వో శ్రీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు, ఆలయ ప్రత్యేకాధికారి మరియు సిపిఆర్వో డా.టి.రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, కంకణ భట్టర్ శ్రీ బాలాజీ రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్, శ్రీ ధనశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ఏర్పాట్లపై భక్తుల ప్రశంస
గరుడ సేవ సందర్బంగా భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఏర్పాటు చేసిన అన్నప్రసాదాలు, తాగునీరు, భద్రత, పార్కింగ్, విద్యుత్, పుష్ప అలంకరణలు తదితర ఏర్పాట్లపై ప్రసంశించారు.
No comments :
Write comments