8.2.26

హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల గోడ ప త్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు jublee hills templs




హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి 25 తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు గోడ పత్రికలను మరియు ఆహ్వా పత్రికలను శనివారం జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు.


 సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మాట్లాడుతూజూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అంచనా వేసి ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారుభక్తులను ఆకట్టుకునేలా విద్యుత్పుష్పాలంకరణలు చేపట్టాలని కోరారుచలువ పందిళ్లుక్యూ లైన్లుతాగునీరుఅన్నప్రసాదాలుపటిష్ట సెక్యూరిటీ  ఏర్పాటు చేయాలని కోరారు.


 కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎస్వీ ఆలయ ఎల్..సి ప్రెసిడెంట్ శ్రీ విరెడ్డిఏఈవో శ్రీ రమేశ్టెంపుల్ ఇన్పెక్టర్స్ శ్రీ నిరంజన్శ్రీ హరికృష్ణపలువురు అధికారులుభక్తులు పాల్గొన్నారు.  


ఫిబ్రవరి 10 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం


 సందర్భంగా తెల్లవారుజామున వేకువ జూమున స్వామివారిని మేల్కొలిపిఅనంతరం ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడుతారు.  ఉదయం 07.00 గం. నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతారుఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారుఅనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారుఉదయం 11 గం. నుండి సాయంత్రం 05.00 గం. వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.


ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కురాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ


17-02-2026


ఉదయం – ధ్వజారోహణం ( మేష లగ్నం –  . 10.30 – 11.00 గంటల వరకు)


రాత్రి – పెద్దశేష వాహనం


18-02-2026


ఉదయం – చిన్నశేష వాహనం


రాత్రి – హంస వాహనం


19-02-2026


ఉదయం – సింహ వాహనం


రాత్రి – ముత్యపుపందిరి వాహనం


20-02-2026


ఉదయం – కల్పవృక్ష వాహనం


రాత్రి – సర్వభూపాల వాహనం


21-02-2026


ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)


రాత్రి – గరుడ వాహనం (రాత్రి 07.00 గం. నుండి 09.00 గం. వరకు)


22-02-2026


ఉదయం – హనుమంత వాహనం


రాత్రి – గజ వాహనం


23-02-2026


ఉదయం – సూర్యప్రభ వాహనం


రాత్రి – చంద్రప్రభ వాహనం


24-02-2026


ఉదయం – రథోత్సవం


రాత్రి – అశ్వవాహనం


25-02-2026


ఉదయం – చక్రస్నానం(. 08.00 నుండి 10.00 గంటల వరకు)


రాత్రి – ధ్వజావరోహణంసా. 6 నుండి రాత్రి 8 గంటల వరకు)


26.02.2026.


మధ్యాహ్నం 03.00 గం.లకు పుష్పయాగం .


ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలుభజన కార్యక్రమాలను నిర్వహించనున్నారుఅన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.


No comments :
Write comments