16.2.26

నంది వాహనంపై కైలాసనాథుడు nandi vahanam








తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం రోజైన ఆదివారం రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు.


భజనమండళ్ల కోలాటాలుభజనలుమంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో సాయంత్రం 6 గంటల నుండి వాహనసేవ కోలాహలంగా జరిగిందివిశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూ హారతులు సమర్పించారుమ‌హావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది.


లింగోద్భవకాల అభిషేకం


ఫిబ్ర‌వ‌రి 16 తేదీ సోమ‌వారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారుఉదయం 8 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.


వాహ‌న సేవ‌లో టీటీడీ సివిఎస్వో శ్రీ కే.వి.ముర‌ళికృష్ణ‌ఆలయ ప్ర‌త్యేకాధికారి శ్రీ డి.ఫ‌ణికుమార్ నాయుడుసూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆల‌య అర్చ‌క‌లు విశేష‌ సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments