తిరుమలలో ఓ భక్తుడి వద్ద తప్పిపోయిన బంగారు గొలుసును సంబంధిత భక్తునికి ఆదివారం తిరిగి అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి...
శ్రీ డి. కోటేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి వెళ్తుండగా, ఆయన భార్య ధరించిన బంగారు గొలుసు జారి పడి పోయింది.
ఈ విషయమై సదరు భక్తుడు అందించిన ఫిర్యాదు మేరకు, సీవీఎస్‌ఓ శ్రీ మురళీకృష్ణ ఆదేశాలతో, విఎస్ఓలు శ్రీ రాం కుమార్, శ్రీ సురేంద్ర ల పర్యవేక్షణలో, ఏవీఎస్ఓ శ్రీ చిరంజీవి మరియు ఆయన బృందం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు గొలుసును గుర్తించి భక్తునికి తిరిగి అప్పగించారు.
ఈ సందర్భంగా సీవీఎస్‌ఓ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తతను, త్వరిత స్పందనను ప్రశంసించారు.
No comments :
Write comments