3.2.26

ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం peta utsavam








తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం సోమవారం ఘనంగా జరిగిందిమాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.


ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు బయల్దేరిందిఉదయం 8.30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుందిఅక్కడ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెపసుపుచందనంలతో స్వామిఅమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.


అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించారుసాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుండి బయల్దేరి రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.


ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా  ఉత్సవాన్ని నిర్వహిస్తారుఉదయంసాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలుకోలాటాలు నిర్వహించారు.


 కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీ  ముని కుమారన్టెంపుల్ న్స్పెక్టర్ శ్రీ సురేష్ఇతర ధికారులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments