VIDEO
ఫిబ్రవరి 26 నుండి మార్చి 02 వ తేదీ వరకు తి రుమలలో నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో శ్రీ సి . హెచ్ . వెంకయ్ య చౌదరి పద్మావతి అతిథి భవనంలో ని సుధర్మ సమావేశ మందిరంలో సో మవారం ఉదయం అధికారులతో సమీక్ష స మావేశం నిర్వహించారు .
ఈ సందర్భంగా తెప్పోత్సవాలకు భక్ తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు :
• 23 వ తేది తెప్పల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ట్రైల్ రన్.
• పుష్కరిణీలో పుష్కలంగా నీరు ఉండేలా చర్యలు.
• పుష్కరిణీ, తెప్పలకు ఆకర్షణీ యంగా విద్యుత్ అలంకరణ.
• వరహా స్వామి ఆలయం, నాలుగు మా డ వీధుల్లో పందిళ్లు ఏర్పాటు.
• భక్తులకు సూచనలు అందించేందు కు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్ పాటు.
• ఫిబ్రవరి 20 నుండి మార్చి 5 వ తేది వరకు పుష్కరిణీ స్నానాని కి భక్తులను అనుమతించరు.
• ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్ లో అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు. పుష్కరిణీలో అందుబాటు లో గజ ఈతగాళ్లు.
• తెప్పోత్సవాలు ప్రాశస్త్యం భ క్తులకు తెలిసేలా పబ్లిక్ అడ్ రస్ సిస్టమ్ ద్వారా ఏర్పాట్లు.
• తెప్పోత్సవాల కారణంగా ఫిబ్ రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ , ఫిబ్రవరి 28 న, మార్చి 01, 02 వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్ సవం, సహస్రదీపాలంకార సేవలను టీ టీడీ రద్దు.
అనంతరం అదనపు ఈవో మార్చి 3 న జరగ నున్న కుమారధార తీర్థ ముక్కోటి పై సమీక్షించారు.
కుమార ధార ముక్కోటి సమీక్ష సమా వేశంలో ముఖ్యాంశాలు:
• మార్చి 3 న ఉదయం 5 నుండి 10 గం టల వరకు మాత్రమే భక్తులను అను మతిస్తారు.
• చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 9 గంటల పైన భక్తులకు అన్న ప్రసా దాల పంపిణీ ఉండదు.
• తదనుగుణంగా భక్తులు తమ ప్రణా ళికలను రూపొందించుకుని తిరుమలకు రావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్ తి.
అనంతరం అదనపు ఈవో చంద్ర గ్రహణం రోజున చేపట్టాల్సిన ముందస్తు ఏర్పా ట్లపై అధికారులతో సమీక్షించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
• మార్చి 3 న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7.30 గంటల వరకు చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత. ( మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 వరకు చంద్ర గ్రహణం.)
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రా మ్ భగీచా, సీఆర్వోల వద్ద భక్తు లకు దాదాపు 40 వేల పులిహోర ప్యా కెట్ల పంపిణీకి ఏర్పాట్లు.
• ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్ ద ర్శనాలు రద్దు.
• చంద్రగ్రహణం కారణంగా మార్చి 3 వ తేదీ మంగళవారం అష్టదళ పాద ప ద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స వం, సహస్రదీపాలంకార సేవలు రద్దు .
• వీటితో పాటు ఆరోజున వీఐపీ బ్ రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనా లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్ శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు , వృద్ధులు, దివ్యాంగులు, దాతలు , ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు.
ఈ సమావేశంలో డిప్యూటీ ఈవోలు శ్ రీ లోకనాథం, శ్రీ భాస్కర్ శ్రీ సోమన్నారాయణ, శ్రీమతి సువర్ణమ్ మ, ఈఈలు శ్రీ శ్రీనివాసరావు, శ్ రీ సుధాకర్, వీజీవో శ్రీ సురేం ద్ర, ఇతర అధికారులు పాల్గొన్నా రు.
No comments :
Write comments