టిటిడి
ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడల్లో శనివారం ఫుట్‌బాల్, బ్లాంకెట్ వాలీ బాల్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ పోటీలు జరిగాయి. ఆ పోటీల వివరాలు ఇలా ఉన్నాయి.
- పురుష ఉద్యోగుల ఫుట్‌బాల్ పోటీలలో శ్రీ ఉమాపతి జట్టు విజయం సాధించగా, శ్రీ దామోదర్ రెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది.
- 45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల బ్లాంకెట్ వాలీ బాల్ పోటీలలో శ్రీమతి కవిత విజయం సాధించగా, శ్రీమతి పద్మావతి రన్నరప్‌గా నిలిచింది.
- 45 ఏళ్ల లోపు మహిళా ఉద్యోగుల బ్లాంకెట్ వాలీ బాల్ పోటీలలో పోటీల్లో శ్రీమతి గంగాదేవి జట్టు విజయం సాధించగా, శ్రీమతి శ్యామలాదేవి జట్టు రన్నరప్‌గా నిలిచారు.
- దివ్యాంగ ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో శ్రీ ఆంజనేయులు విజయం సాధించగా, శ్రీ రెడ్డప్ప రన్నరప్ గా నిలిచారు.
- దివ్యాంగ ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ డబుల్స్ పోటీల్లో శ్రీరెడ్డప్ప, శ్రీ రమణ విజయం సాధించగా, శ్రీ శివరామకృష్ణ, శ్రీ ఆంజనేయులు రన్నరప్ గా నిలిచారు.
- దివ్యాంగ మహిళా ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి తులసమ్మ విజయం సాధించగా, శ్రీమతి ప్రియాంక రన్నరప్ గా నిలిచారు.
- దివ్యాంగ ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ డబుల్స్ పోటీల్లో శ్రీమతి అమ్ములు, శ్రీమతి విజయలక్ష్మి విజయం సాధించగా, బి.అరుణ కుమారి, టి.గంగోజమ్మ రన్నరప్ గా నిలిచారు.
- విశ్రాంత పురుష ఉద్యోగుల క్యారమ్స్ సింగిల్స్ పోటీలలో శ్రీ దాస్ విజయం సాధించగా, శ్రీ ఆశోక్ కుమార్ రన్నరప్‌గా నిలిచారు.
- విశ్రాంత పురుష ఉద్యోగుల క్యారమ్స్ డబుల్స్ పోటీలలో శ్రీ జయచంద్ర, శ్రీ ఆశోక్‌కుమార్ విజయం సాధించగా, శ్రీ పాండురంగయ్య రెడ్డి, శ్రీ దాస్ రన్నర్‌గా నిలిచారు.
No comments :
Write comments