10.2.26

శ్రీనివాసమంగాపురం బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు srinivasa manga puram









శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ చేపట్టిన విద్యుత్ కాంతులుపుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయిశ్రీనివాసమంగాపురం పరిసర ప్రాంతాలుజాతీయ రహదారులుప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఇవి బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సవంగా మారుస్తున్నాయి.


బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్న, మధ్యపెద్ద పరిమాణాల్లో సుమారు 75కు పైగా అద్భుతమైన ఇల్యూమినేషన్ బోర్డులు ఏర్పాటు చేశారు. నాలుగు మాడ వీధులలో గరుత్మంతుడిపై మహావిష్ణువులక్ష్మీదేవి, ఆభరణాల వేంకటేశ్వర స్వామివినాయకుడులక్ష్మీగజవాహనంఆదిశేషుడిపై మహావిష్ణువుదశావతారాలుఅష్టలక్ష్మీ తదితర రూపాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.


అదేవిధంగాశ్రీనివాసమంగాపురంచెర్లోపల్లి పరిసర ప్రాంతాల్లో దశావతారాలుఅష్టలక్ష్మీలుశ్రీవేంకటేశ్వర స్వామిమహావిష్ణువులక్ష్మీదేవిగజవాహనంపై లక్ష్మీదేవిశంఖుచక్రాలుఏనుగులుకమలాలువారాహావతారంతోరణాలుచిన్న లక్ష్మీదేవి రూపాలుఅభయహస్తంవజ్రకిరీటంకటిహస్తంనైన్ వాట్స్ తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


చెర్లోపల్లిశ్రీనివాసమంగాపురం, చంద్రగిరికాలూరు మార్గాలుజాతీయ రహదారుల వెంట ఎల్..డి లైట్లతో డిజైన్ చేసిన ఆర్చ్‌లు ఏర్పాటు చేశారుపుదిపట్ల జంక్షన్, శ్రీనివాసమంగాపురంతిరుపతి పరిసరాలుఆలయ పుష్కరిణిఆలయం లోపల మరియు వెలుపలనాలుగు మాడ వీధులుకార్ పార్కింగ్ ప్రాంతంశ్రీనివాసమంగాపురంనరసింగాపురం జంక్షన్చంద్రగిరి బస్టాండ్శ్రీనివాసమంగాపురం రైల్వే గేట్ తదితర ప్రాంతాలు రాత్రి వేళల్లో రజతంలా మెరిసిపోతూ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక శోభను అందిస్తున్నాయి.


బ్రహ్మోత్సవాల నిర్వహణకు మూడు నెలల ముందుగానే టీటీడీ ఎలక్ట్రికల్ శాఖ ఆధ్వర్యంలో అధికారులుసిబ్బంది విద్యుత్ అలంకరణల ఏర్పాట్లను చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారుశ్రీనివాసమంగాపురం అంతటా విద్యుత్ కాంతుల వెలుగులు భక్తుల హృదయాలను ఆకట్టుకుంటున్నాయి.


మైమరిపిస్తున్న పుష్పాలంకరణలు


శ్రీనివాసమంగాపురం ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు అలంకరణకు దాదాపు 10 టన్ను పుష్పాలను వినియోగించనున్నారుఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీ జాతుల పుష్పాలు కూడా ఉన్నాయివాహన సేవల సందర్భంగా స్వామిఅమ్మవార్లను సువాసనభరితమైన పుష్పాలతో విశేషంగా అలంకరించనున్నారు.


ఆలయం ముందు వివిధ రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలుస్వామి మరియు అమ్మవార్ల రూపాలను ప్రతిబింబించే పుష్ప బోర్డులు భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయివిద్యుత్ కాంతులుపుష్పాలంకరణల సమ్మేళనంతో శ్రీనివాసమంగాపురం ఆలయ పరిసరాలు దివ్య కాంతులతో వెలిగిపోతున్నాయి.

No comments :
Write comments