20.2.26

శ్రీ పద్మావతీ మహిళా డిగ్రీ కళాశాలలో మరింత మెరుగైన ఫలితాలపై ప్రత్యేక దృష్టి - టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ ttd jeo (h&e)








తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని టిటిడి జేఈవో (వైద్యం విద్యడాశరత్ అధ్యాపకులకు సూచించారుగురువారం ఆయన కళాశాల మరియు హాస్టల్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూగౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టిటిడి విద్యాసంస్థలలో సమస్యల పరిష్కారంమౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారుటిటిడి పాలక మండలి సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు.


శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం 3,106 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తుండగావారిలో 2,350 మంది హాస్టల్ వసతి పొందుతున్నారని తెలిపారు. కళాశాల ప్రతిష్టను మరింత పెంపొందించేలా నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యమనిఅందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు.


విద్యార్థినులలో మెరుగైన ప్రతిభ కలిగినవారుసగటు స్థాయితక్కువ స్థాయినెమ్మదిగా నేర్చుకునే విద్యార్థినులను గుర్తించిసమతుల్య గ్రూపులుగా విభజించి బోధన నిర్వహించాలని సూచించారుప్రత్యేక పరీక్షలు నిర్వహించి ఫలితాలను విశ్లేషిస్తూ ముందుకు సాగితే వందశాతం ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారుపరీక్షల ఫలితాలు తగ్గితే సంబంధిత అధ్యాపకులు బాధ్యత వహించాలన్నారు.

బోధన ప్రమాణాలువసతిభోజనంమౌలిక సదుపాయాలపై విద్యార్థినుల భిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారుఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి నేరుగా తీసుకురావాలని సూచించారుఅనంతరం వారితో కలిసి హాస్టల్‌లో భోజనం చేసి పలు సూచనలు చేశారు.


కళాశాల ప్రాంగణంలోని శ్రీకృష్ణదేవారాయుల కాలానికి చెందిన పురాతన బావిని పరిశుభ్రం చేసిఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనివిద్యుత్ కాంతులు మరియు భక్తి భావాన్ని పెంపొందించే మ్యూజిక్ వాతావరణం ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారుఅలాగే 1857 నుండి 1947 వరకు దేశ స్వాతంత్ర్య సమరయోధుల కృషిని నవతరానికి తెలియజేసేలా వారి చిత్రాలుసంక్షిప్త వివరాలను క్రమపద్ధతిలో తెలిసేలా చరిత్ర మరియు సాంస్కృతిక విభాగం గదిలో బోర్డులను ర్పాటు చేయాలని సూచించారుశ్రీవారుశ్రీ పద్మావతి అమ్మవారి వైభవంతో పాటు దేశంరాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలను తెలియజేసే సమాచార బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు.


 కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డానారాయణమ్మవైస్ ప్రిన్సిపాల్ డాభద్రమణివార్డెన్ డామల్లీశ్వరిఅధ్యాపకులుసిబ్బందిఇంజనీరింగ్ అధికారులువిద్యార్థినులు పాల్గొన్నారు.


No comments :
Write comments