11.2.26

ఎస్వీ ఆయుర్వేద కళాశాలను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాలి – టిటిడి జేఈవో (వైద్య, విద్య) డా. ఎ. శరత్ ttd jeo (h&e)





టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలను దేశంలోనే అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దాలని టిటిడి జేఈవో (వైద్యవిద్యడాశరత్ తెలిపారుమంగళవారం ఆయన ఎస్వీ ఆయుర్వేద కళాశాల మరియు అనుబంధ వైద్యశాలను పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూకళాశాల మరియు వైద్యశాలలో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వైద్ సేవలు అందించాలని సూచించారుప్రాచీన ఆయుర్వేదంలోని విశిష్టతను నేటి తరానికి చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారుఆయుర్వేద వైద్యులు ప్రణాళికాబద్ధంగా పరిశోధనలు చేపట్టి మార్గదర్శకులుగా నిలవాలని కోరారు.


ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కళాశాలలోని సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారుఅండర్ గ్రాడ్యుయేషన్పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల సమస్యలుకళాశాల మౌలిక సదుపాయాలుసిబ్బందిభద్రత వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారువిద్యార్థులు ఆయుర్వేదంలో నూతన పరిశోధనలు చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు.


అంతకుముందు ఆయన విద్యార్థులతో ముచ్చటించివారి సమస్యలపై వివరాలు తెలుసుకున్నారుఅనంతరం బోధనా సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారువిద్యార్థులకు అవసరమైన భవనాల నిర్మాణానికి సంబంధించి ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.


కళాశాల ప్రిన్సిపాల్ డారేణు దీక్షిత్ కళాశాల పురోగతివైద్యశాలలో జరుగుతున్న రోజువారీ కార్యక్రమాలను జేఈవోకు వివరించారు.


 కార్యక్రమంలో ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లుశ్రీ మనోహరంఈఈ శ్రీమతి సుమతికళాశాల బోధనా సిబ్బంది మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments