టిటిడి
ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో ఔషధ మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించామని టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ తెలిపారు. శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీని బుధవారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, ఎస్వీ ఆయుర్వేద వైద్యశాలకు అవసరమైన మందుల తయారీకి కావాల్సిన ఔషధ మొక్కల పెంపకంపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న అత్యాధునిక యంత్రాల నిర్వహణ, సాంకేతిక సమస్యలతో నిలిచిపోయిన యంత్రాలకు తక్షణమే మరమ్మతులు, రోజువారీ వినియోగం, అత్యాధునిక యంత్రాల నిర్వహణకు అవసరమైన నిపుణలైన సిబ్బంది నియామకం, ఇతర సిబ్బంది తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.
ఫార్మసీలో ముడి సరుకులను ఆరు నెలల నుంచి ఏడాది వరకు నిల్వ ఉంచే విధంగా తగిన స్టోరేజ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మందుల తయారీ, ప్యాకింగ్, తయారీ ప్రక్రియ తదితర విభాగాలు క్రమబద్ధంగా ఉండేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. మందుల తయారీ గదుల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సిబ్బందికి డ్రెస్ కోడ్ అమలు చేయాలని ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డా. రేణు దీక్షిణ్‌ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఈఈ శ్రీ ప్రసాద్, శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
No comments :
Write comments