చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాలను మార్చి 3వ తేది మూసివేస్తారు. తిరిగి మార్చి 3వ తేది రాత్రి ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
మార్చి 3వ తేది మంగళవారం మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలను మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. రాత్రి 7.30 గంటలకు తలుపులు తెరుస్తారు. శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం సర్వదర్శనానికి అనుమతిస్తారు.
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. రాత్రి 7.30 తెరిచి, శుద్ధి, పుణ్యహవచనం ఇతర కైంకర్యాల అనంతరం రాత్రి 9 గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేస్తారు. రాత్రి 7.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
నారాయణవనంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి, బుగ్గలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సత్రవాడలోని శ్రీ కరివరదరాజస్వామి ఆలయం, నగరిలోని శ్రీ కరియమాణిక్యస్వామి ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేసి, రాత్రి 7:30 గంటలకు తెరుస్తారు. ఆలయ శుద్ధి, పుణ్యహవచనం తదితర సేవల అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, వాయల్పాడులోని శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసివేసే రాత్రి 7:30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.
No comments :
Write comments