24.3.26

శ్రీ సీతారాముల కళ్యాణానికి మార్చి 30 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలి - ఏర్పాట్లపై సమగ్ర తనిఖీలు నిర్వహించిన జేఈఓ శ్రీ వి. వీరబ్రహ్మం sri rama kalyanam






ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 1 నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను మార్చి 30 నాటికి పూర్తి చేయాలని టీటీడీ జేఈఓ శ్రీ వివీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.


సోమవారం జేఈఓ అధికారులతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాలుకళ్యాణ వేదిక వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు


 సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధులుక్యూలైన్లుయాగశాలపోటుసాంస్కృతిక వేదికలను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారువేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడంతాగునీటి సదుపాయాలను విస్తరించడంభక్తులకు చల్లని వాతావరణం కల్పించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


భక్తులను ఆకట్టుకునేలా లేజర్ లైటింగ్ఎల్ఈడి తోరణాలు ఏర్పాటు చేసి ఉత్సవాలకు ఆధ్యాత్మిక శోభను పెంచాలనిఆలయంలో ప్రత్యేక పుష్పాలంకరణలు చేపట్టి దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని సూచించారు.


అనంతరం అన్నప్రసాద భవనాన్ని పరిశీలించిన జేఈఓభక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారుభక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.


కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులుప్రసాద పంపిణీ కేంద్రాలుక్యూలైన్లుగ్యాలరీలుప్రవేశనిష్క్రమణ మార్గాలను పరిశీలించి పలు సూచనలు చేశారుపారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ అవసరమైనన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంఅదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.


శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రతిబింబించేలా భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారుకళ్యాణ వేదికపై తెలుగుదనం ఉట్టిపడేలా పుష్పాలంకరణలు చేయాలన్నారు.

ఆలయంక్యూలైన్లుఅన్నప్రసాద వితరణ కేంద్రాలుగ్యాలరీలలో భక్తులకు సేవలు అందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలని సిపిఆర్ఓ డాటిరవికి సూచించారుశ్రీరామనవమి పర్వదినాన ప్రతి భక్తునికి వడపప్పుపానకం పంపిణీ చేయాలని అన్నప్రసాదం ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రిని ఆదేశించారు.


తరువాత ఒంటిమిట్టలోని టీటీడీ విశ్రాంతి భవనంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిబ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించి తగిన సూచనలు చేశారు.


 కార్యక్రమంలో ఎస్. శ్రీ మనోహరంఎస్. (ఎలక్ట్రికల్శ్రీ వెంకటేశ్వర్లుడిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిసీఎంవో డాకుసుమకుమారివీజీఓ శ్రీ గిరిధర్అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాసునీల్ తదితరులు పాల్గొన్నారు.


No comments :
Write comments