వాల్మీకి మహర్షికి శ్రీరామచంద్రమూర్తి దివ్య దర్శనం కలిగించిన పవిత్ర స్థలమే వాల్మీకిపురం. శ్రీసీతమ్మవారితో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతునితో కూడి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామివారి విగ్రహాలను పరమభక్తుడు జాంబవంతుడు ప్రతిష్టించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి.
వల్మీకము (పుట్ట) నుండి శ్రీరామచంద్రమూర్తి వెలిసిన ప్రదేశంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. అందుకే ఈప్రాంతం వాల్మీకిపురం అనే పేరును పొందింది.
ఈ ఆలయ విమానం సుదర్శన విమానంగా ప్రసిద్ధి చెందింది. చోళరాజుల శిల్పశైలిలో విమానంనిర్మించబడగా, మండపాలు మరియు ద్వార గోపురాలు విజయనగర శైలిలో అత్యంత సుందరంగానిర్మించబడ్డాయి. శ్రీ పట్టాభిరామ స్వామివారి దక్షిణ భాగంలో శ్రీ సీతమ్మవారు ప్రతిష్ఠించబడ్డారు. ప్రతిచైత్రమాసంలో అమ్మవారి జన్మ నక్షత్రమైన ఆశ్లేషా నక్షత్రం రోజున శ్రీ పట్టాభిరామ స్వామివారి కల్యాణోత్సవంఅత్యంత వైభవంగా జరుగుతుంది.
తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ పట్టాభిరామునిపై 20కు పైగా కీర్తనలురచించినట్లు తెలియుచున్నది.
టిటిడి ఆధ్వర్యంలో అభివృద్ధి
శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయాన్ని 23-02-1997న దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి టీటీడీస్వాధీనపరుచుకుంది. అనంతరం ఆలయ మరమ్మత్తులు చేపట్టి 12-08-2005న అష్టబంధనమహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, సూపరింటెండెంట్ శ్రీ ముని బాలకుమార్, టెంపుల్ ఇన్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
మార్చి 29న శ్రీ సీతారామ కల్యాణోత్సం
ఏప్రిల్ 02 పుష్పయాగం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 29న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవంజరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒకఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 10 నుండి12 గంటల వరకు ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగానిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం, మహా నైవేద్యం, పుష్పప్రసాద వితరణ ఘనంగా జరుగనుంది.
వాహనసేవల వివరాలు :
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలు ఉదయం 8 గం.ల నుండి 9 గం.ల వరకు, రాత్రి 8 గం.ల నుండి10 గం.ల వరకు స్వామి వారు విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు.
తేదీ ఉదయం రాత్రి
24.03.2026 (మంగళవారం) ధ్వజారోహణం (మేష లగ్నం) గజవాహనం
25.03.2026 (బుధవారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం
26.03.2026 (గురువారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం
27.03.2026 (శుక్రవారం) సర్వభూపాల వాహనం పెద్ద శేష వాహనం
28.03.2026 (శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభవాహనం, పల్లకీలో మోహినీఅవతారోత్సవం
29.03.2026 (ఆదివారం) తిరుచ్చి ఉత్సవం రాత్రి 08 గం.లకు కల్యాణోత్సవం, రాత్రి 11 గం.లకు గరుడ వాహనం
30.03.2026 (సోమవారం) రథోత్సవం ధూళి ఉత్సవం
31.03.2026 (మంగళవారం) తిరుచ్చి ఉత్సవం అశ్వవాహనం, పార్వేట ఉత్సవం
01.04.2026 (బుధవారం) వసంతోత్సవం, చక్రస్నానం హంస వాహనం, ధ్వజావరోహణం
భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు
వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తులను ఆకట్టుకునేలా ఘనంగానిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అందంగాఅలంకరించారు. అలాగే ఆలయానికి వచ్చే మార్గాల్లో తోరణాలు ఏర్పాటు చేసి భక్తులకు ఆధ్యాత్మికవాతావరణం కల్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండాఅన్నప్రసాదాలు, తాగునీరు, క్యూలైన్లు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలను టీటీడీ ఏర్పాటు చేసింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందాలని టీటీడీ విజ్ఞప్తిచేస్తోంది.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
No comments :
Write comments