టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీ సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగనుంది.
ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రముఖులు విచ్చేసి ప్రసంగిస్తారు. టీటీడీలోని రెగ్యులర్, ఔట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేయనున్న పలువురు మహిళా ఉద్యోగులకు సన్మానం చేస్తారు.
టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
No comments :
Write comments