22.3.26

శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం – భక్తి వైభవానికి నిదర్శనం astanam





శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 523 వర్ధంతి మహోత్సవాల్లో చివరి రోజైన శనివారం తిరుపతిలోని అన్నమాచార్య ళామందిరంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆస్థానం ఘనంగా జరిగింది. భక్తుడి చెంతకు భగవంతుడు రావడం అనే ఆర్యోక్తికి తార్కానంగా శ్రీ వేంకటేశ్వరస్వామికి పరమభక్తుడైన అన్నమాచార్యుడు వెలసిన అన్నమాచార్య కళామందిరానికి శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవర్లు వేంచేయడం సంప్రదాయంగా కొనసాగుతోందిఅనంతరం గోవిందరాజస్వామివారిపై న్నమయ్య రచించిన సంకీర్తనలను ప్రాజెక్టు కళాకారులు సుమధురంగా లపించారు.


అంతకుముందు ఉదయం 7 గంటలకు శ్రీదేవిభూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయం నుండి ఊరేగింపుగా నాలుగు కాళ్ల మండపంతీర్థకట్టవీధి మీదుగా అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారుఆస్థానం అనంతరం తిరిగి ఉదయం 10 గంటలకు ఉత్సవమూర్తులను గోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకెళ్లారు.


 కార్య‌క్ర‌మంలో ఆల‌య ఏఈవో శ్రీ నారాయ‌ణ చౌద‌రిఅన్న‌మాచార్ ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ‌మ‌తి ల‌త‌ఇత‌ర‌ అధికారులుక‌ళాకారులుపుర‌ప్ర‌జ‌లు పాల్గొన్నారు.


No comments :
Write comments