25.3.26

అశ్వవాహనంపై అభయమూర్తి శ్రీరాముడు aswa vahanam










తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు మంగ‌ళ‌వారం రాత్రి స్వామివారు అశ్వ వాహనంపై భక్తులను నుగ్రహించారురాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది.


భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయిఅందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడుపరమాత్మను అశ్వస్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసిందిస్వామి అశ్వ వాహనాధిరూఢడై భక్తులకు దర్శనమిచ్చి తద్వారా తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండమని నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించి తరించమని ప్రబోధిస్తున్నాడు.


వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామిడెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నటెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులువిశేష సంఖ్యలో క్తులు పాల్గొన్నారు.


No comments :
Write comments