25.3.26

వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం రామనామ స్మరణతో మార్మోగిన తిరువీధులు kodanda rama








తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు మంగళవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.


ఉదయం 8.30 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు


భక్తుల రామనామ స్మరణతో తిరుపతి తిరువీధులు మార్మోగాయి.


డప్పు వాయిద్యాలుభజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు భక్తి భావంతో రథాన్ని లాగారుఅడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారురథం నాలుగు మాడ వీధుల్లో ఊరేగి యథాస్థానానికి చేరిన అనంతరం ప్రబంధంవేద శాత్తుమొర నిర్వహించి హారతి ఇచ్చారు.


రథోత్సవానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక తాత్పర్యం ఉందిఆత్మ రథికుడుశరీరమే రథంబుద్ధి సారథిమనస్సు పగ్గంఇంద్రియాలే గుర్రాలువిషయాలే వీధులుగా భావిస్తారు విధంగా శరీరాన్ని రథంతో పోల్చడం ద్వారా శరీరం వేరని, ఆత్మ భిన్నమని తెలియజేసే ఆత్మఅనాత్మ వివేకం కలుగుతుందిరథోత్సవం ద్వారా భక్తులకు  తత్త్వజ్ఞానం తెలియజేయబడుతుంది.


మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అర్చకులు తిరుమంజనంఆస్థానం నిర్వహించనున్నారురాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ వేడుకగా రగనుంది.


 కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామిటీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జిభానుప్రకాశ్ రెడ్డిఆలయ డెప్యూటీ వో శ్రీమతి నాగరత్నసూపరింటెండెంట్ శ్రీ మునిశంకర్టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ఇంజినీరింగ్ అధికారులు మరియు విశే సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


మార్చి 25 చక్రస్నానం


శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు కపిలతీర్థంలో చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు.

No comments :
Write comments