శ్రీవారి దర్శన క్యూలైన్ లో నిన్న రాత్రి రాజమహేంద్రవరానికి చెందిన శ్రీ అనుపోజు వీర నవీన్ అనే భక్తుడు నారాయణగిరి షెడ్లలో తోటి భక్తులను ప్రేరేపించి నినాదాలు చేశాడు.
ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో సదరు భక్తుడిని పిలిపించి మాట్లాడగా దర్శన క్యూలైన్ లో నినాదాలు చేయడం ముమ్మాటికీ తన తప్పేనని ఒప్పుకున్నాడు.
ఇందుకుగాను టీటీడీ మరియు శ్రీవారి భక్తులకు ఆ భక్తుడు క్షమాపణలు తెలియజేశాడు.
కాగా భక్తులందరూ శ్రీవారి దర్శనంలో తమ వంతు వచ్చే వరకు సంయమనంతో ఓపిగ్గా వేచి ఉంటూ సిబ్బందికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
No comments :
Write comments