13.3.26

శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరించిన టిటిడి ఈవో booklet




తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్‌లెట్‌ను టిటిడి ఈవో శ్రీ ఎం.రవిచంద్ర  గురువారం ఆవిష్కరించారుటిటిడి నివాస గృహంలోని ఈవో చాంబర్‌లో  కార్యక్రమం జరిగింది.


 సందర్భంగా ఈవో మాట్లాడుతూమార్చి 17 నుండి 25 తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారుఇందులో భాగంగా మార్చి 16 అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.


అలాగేమార్చి 19 ఉగాది ఆస్థానంమార్చి 27 నుండి 29 తేదీ రకు శ్రీరామనవమి ఉత్సవాలుమార్చి 30 నుండి ఏప్రిల్ 1 తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో వెల్లడించారు


భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామిఅమ్మవారి కృపకు పాత్రులు కావాలని  సందర్భంగా ఈవో కోరారు.


అంతకుముందు ఆలయ అర్చకులు టిటిడి ఈవో కు వేదాశీర్వచనం చేశారు


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్నఆలయ సిబ్బంది , అర్చకులు పాల్గొన్నారు.

No comments :
Write comments