శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి ఉత్సవాలను మార్చి 14 నుండి 21వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ ఉత్సవాలు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం మరియు మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి.
మార్చి 14వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది.
మార్చి 15న సంకీర్తన గోష్టిగానం
మార్చి 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తన గోష్టిగానం నిర్వహించనున్నారు.
సాహితీ సదస్సులు, భక్తి సంగీత కార్యక్రమాలు
మార్చి 15 నుండి 21వ తేదీ వరకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు సాహితీ సదస్సులు, సాయంత్రం భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
తాళ్లపాకలోని ధ్యానమందిరం మరియు 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక మరియు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మహతి కళాక్షేత్రంలో సంగీత సభ
మార్చి 16 నుండి 18వ తేదీ వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సంగీత సభలు నిర్వహించనున్నారు.
No comments :
Write comments