13.3.26

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలి vontimitta






ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నులను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో శ్రీ వివీరబ్రహ్మం అధికారులను ఆదేశించారుశుక్రవారం ఆయన ఒంటిమిట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్చి 16 నుండి నిత్య అన్నప్రసాదం వితరణ ప్రారంభించనున్నట్లు తెలిపారుటీటీడీలోని అన్ని విభాగాలు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

అలాగే ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నిత్య అన్నప్రసాద భవనాన్ని మార్చి 16 ప్రారంభించనున్నట్లు తెలిపారు.


అనంతరం ఆయన అధికారులతో కలిసి ఆల నాలుగు మాడ వీధులునిత్య అన్నప్రసాద భవనంశ్రీ సీతారాముల ల్యాణ వేదికలను పరిశీలించి పలు సూచనలు చేశారు.


తదుపరి టీటీడీ మరియు జిల్లా అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.


 కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ టి.వి.సత్యనారాయణఎస్ఈ (ఎలక్ట్రికల్శ్రీ వెంకటేశ్వర్లుగార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులుడిప్యూటీ ఈవోలు శ్రీ శివప్రసాద్శ్రీ సెల్వండీఈ (ఎలక్ట్రికల్శ్రీ రవి శంకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments